అసెంబ్లీ నుంచి ప్రతిపక్షాల వాకౌట్
హైదరాబాద్: సంక్షేమ హాస్టళ్లకు బడ్జెట్ కేటాయింపులపై ప్రభుత్వ వివరణకు సంతృప్తి చెందని తెలుగుదేశం, వామపక్షాలు, బిజెపి గురువారం శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), ప్రజారాజ్యం నిరసన వ్యక్తం చేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ పక్షాలు వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దానికి ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి.
నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచకపోవడంతో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు సరైన ఆహారం అందించడం కష్టంగా మారిందని తెలుగుదేశం పార్టీ సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనందుకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సంక్షేమ హాస్టళ్లను కొన్నింటిని తాను సందర్శించానని, వాటిలో ఏ మాత్రం వసతులు లేవని, విద్యార్థులు కటిక నేలపై పడుకుంటున్నారని ప్రజారాజ్యం శాసనసభా పక్ష నేత చిరంజీవి అన్నారు.












Click it and Unblock the Notifications