ఉస్మానియాలో మురళీనాథ్ మృతదేహం

మురళీనాథ్ తనకు గత నెల 28వ తేదీన ఫోన్ చేశాడని, తనను తీవ్రంగా వేధిస్తున్నారని, ఈ విషయాన్ని శాసనసభలో లేవనెత్తేలా మీడియా దృష్టికి తీసుకుని వెళ్లాల్సిందిగా చెప్పాడని ఆయన భార్య కవిత చెబుతోంది. నోయిడాకు వెళ్లే ముందు తనకు ఫోన్ చేసినట్లు ఆమె చెబుతోంది. ఈలోగానే అతను మరణించాడని ఆమె అంటోంది. నిజానికి అది మురళీనాథ్ శవమేనా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. వైద్య నిపుణుల కమిటీ పర్యవేక్షణలో రీపోస్టుమార్టం జరగాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.
మురళీనాథ్ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎల్బీ నగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. మురళీనాథ్ మృతదేహం మంగళవారం తెల్లవారు జామున మూడు గంటలకే వచ్చినట్లు తమకు తెలిసిందని, అయితే కుటుంబ సభ్యులను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చెప్పలేదని ఆయన అంటున్నారు. పొంతన లేని ప్రకటనలు, హామీలు మురళీనాథ్ కుటుంబ సభ్యుల్లో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.












Click it and Unblock the Notifications