వరంగల్: వరంగల్ లోని కాకతీయ వైద్య కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేశారు. ర్యాగింగ్ కు గురైన కృష్ణచైతన్య అనే ఎంబిబియస్ మొదటి సంవత్సరం విద్యార్థి తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. ఈ విషయమై విద్యార్థి తండ్రి ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశాడు. ర్యాగింగ్ జరిగిన మాట వాస్తవమేనని ప్రిన్సిపల్ అంటున్నారు. విద్యార్థి తీవ్ర భయాందోళనలకు గురయ్యాడని, దాంతో విషయాలు చెప్పలేకపోతున్నాడని, అతన్ని గెస్ట్ హౌస్ కు పంపించామని ఆయన వివరించారు.
బీరు, సిగరెట్ తాగాలని సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థి కృష్ణ చైతన్యను బలవంత పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇతర రూపాల్లో కూడా అతన్ని వేధించినట్లు సమాచారం. దీంతో కృష్ణచైతన్య తీవ్రంగా కలత చెందాడు.