బాబుపై తలసాని గరం గరం

Talasani Srinivas Yadav
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ నాయకుడు టి.దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీలో పునప్రవేశంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరడానికి దేవేందర్ గౌడ్ సోమవారం ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేశారు. దేవేందర్ గౌడ్ ను తిరిగి పార్టీలో చేర్చుకోవాలనే నిర్ణయంపై హైదరాబాదుకు చెందిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారు. బహిరంగ క్షమాపణ చెప్తే తప్ప దేవేందర్ ను తిరిగి పార్టీలో చేర్చుకోకూడదని తలసాని శ్రీనివాస యాదవ్ చంద్రబాబుకు సూచించారు. అయితే చంద్రబాబు ఆయన మాటలను ఖాతరు చేసిన సూచనలు కనిపించడంలేదు.

తన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి తలసాని శ్రీనివాస యాదవ్ తన అనుచరులతో సమావేశమవుతున్నారు. ఇంతకు ముందు పార్టీ తెలంగాణ అనుకూల వైఖరిని తప్పు పడుతూ శ్రీనివాస యాదవ్ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. నిజానికి ఆయన కాంగ్రెసు పార్టీలో చేరాలని అనుకున్నట్లు, కాంగ్రెసులోని స్థానిక కార్యకర్తలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో ఆయన చేరలేకపోయారని అంటున్నారు. ఈ పరిస్థితిలో ఆయన తెలుగుదేశంలోనే కొనసాగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో శ్రీనివాస యాదవ్ మాట విని దేవేందర్ గౌడ్ ను దూరం చేసుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు.

అంతేకాకుండా, ప్రజారాజ్యం పార్టీని మరింత బలహీన పరిచే ఉద్దేశం కూడా చంద్రబాబుకు ఉంది. ఆ కారణంగా ప్రజారాజ్యంలోకి వెళ్లిన మాజీ పార్టీ నాయకులకు ఒక రకంగా చంద్రబాబు బేషరతుగానే ఆహ్వానం పలకాలని అనుకుంటున్నారు.పార్టీలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న దేవేందర్ గౌడ్ కు ఆటంకాలు కల్పిస్తే మిగతా నాయకులు రావడానికి పునరాలోచన చేస్తారనే ఉద్దేశం ఆయనకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో దేవేందర్ కు సాఫీగా పార్టీ తీర్థం తిరిగి ఇవ్వడానికే చంద్రబాబు నిశ్చయించుకున్నారు. దీంతో తలసాని శ్రీవినాస యాదవ్ మండిపడుతున్నట్లు చెబుతున్నారు. దేవేందర్ గౌడ్ కు తలసానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న సందర్భాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+