కలిసి రండి: చిరుతో బాబు
హైదరాబాద్: ఓబుళాపురం గనుల లీజు విషయంలో తమతో కలిసి రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని కోరారు. ఓబుళాపురం గనుల లీజు వ్యవహారంపై గందరగోళం మధ్య సభ గురువారం కొద్ది సేపు వాయిదా పడిన సమయంలో చంద్రబాబు చిరంజీవికి ఆ విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం సభ్యులు దూళిపాళ నరేంద్ర, ఎర్రబెల్లి దయాకరరావు చిరంజీవితో చర్చలు జరిపారు. చంద్రబాబు విజ్ఞప్తిని వారు చిరంజీవికి వినిపించారు.
అదే సమయంలో నారా చంద్రబాబు నాయుడు మిగతా ప్రతిపక్షాల ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. ఓబుళాపురం గనుల లీజు అక్రమాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేయాలని చంద్రబాబు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లను కోరారు. ఈ కసరత్తు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ఫలితం ఇచ్చినట్లు అర్థమైంది.












Click it and Unblock the Notifications