భవంతిలో పేలుడు: 3గురు మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని ఒంగోలు గుంటూరు రోడ్డులో ఒక బాణాసంచా కేంద్రంలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మరణించగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోనకరంగా ఉంది. పేలుడు ధాటికి భవనం పూర్తిగా కూలిపోయింది. శిథిలాల కింద మరింత మంది కార్మికులు చిక్కుకుని పోయి ఉంటారని భావిస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక దళ సిబ్బంది మంటలు ఆర్పడంలో నిమగ్నమైంది. పేలుడుకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications