బాబుతో గొంతు కలిపిన చిరు
హైదరాబాద్: ఓబుళాపురం గనుల లీజు వ్యవహారంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో గొంతు కలిపారు. ఈ వ్యవహారంలో శాసనసభలో తమతో కలిసి రావాలని అంతకు ముందు చంద్రబాబు చిరంజీవిని కోరారు. దాంతో ఓబుళాపురం గనుల లీజు వ్యవహారంపై సభా సంఘం వేయాలని చిరంజీవి సభలో గురువారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలా కొనసాగితే దానికి అంతం ఉండదని, సభా సంఘం వేస్తే సమస్యపై వివాదం ముగుస్తుందని ఆయన అన్నారు. సభా సంఘం వేయకపోతే వివాదం నిరంతరం కొనసాగుతుందని ఆయన అన్నారు.
ఓబుళాపురం గనుల లీజు వ్యవహారం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడుల వ్యక్తిగత విషయం కాదని, ప్రజలకు సంబంధించిన విషయమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. ఓబుళాపురం గనుల లీజు వ్యవహారంపై సభా సంఘం వేయాలని తెరాస, సిపిఐ, సిపిఎం, లోకసత్తా డిమాండ్ చేశాయి.












Click it and Unblock the Notifications