సభా సంఘానికి ప్రభుత్వం నో
హైదరాబాద్: ఓబుళాపురం గనుల లీజు వ్యవహారంపై సభా సంఘం వేయాలనే ప్రతిపక్షాల డిమాండ్ ను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తోసిపుచ్చారు. వ్యవహారం కోర్టులో ఉన్నందను సభా సంఘం యలేమని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వం సభా సంఘం వేయలేమని చెప్పిన తర్వాత ఆ విషయం పట్టుబట్టకూడదని స్పీకర్ కె. కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపక్షాల సభ్యులకు సూచించారు. అయితే ప్రతిపక్షాలు తమ పట్టును వీడలేదు. కోర్టులో వ్యవహారం ఉన్నప్పటికీ సభా సంఘం విచారణకు ఆదేశించిన సందర్భాలున్నాయని తెలుగుదేశం సభ్యుడు మండవ వెంకటేశ్వరరావు అన్నారు. ఇది తన వ్యక్తిగత వ్యవహారం కాదని, తనపై ముఖ్యమంత్రి వ్యక్తిగత ఆరోపణలు చేశారని చంద్రబాబు అన్నారు.చంద్రబాబు తనపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వడానికి చేసిన ప్రయత్నాన్ని స్పీకర్ అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు ఆగ్రహం చెంది, ఏం మాట్లాడాలో, ఏం చేయాలో చెప్పండని అంటూ కూర్చున్నారు. ఆ తర్వాత బడ్జెట్ పై సమాధానం ఇవ్వాల్సిందిగా స్పీకర్ కిరణ్ కుమార్ ఆర్థిక మంత్రి కె. రోశయ్యకు సూచించారు. ప్రతిపక్షాలు నినాదాలు చేస్తున్న సమయంలో రోశయ్య మాట్లాడడం సాగించారు. సభ సద్దుమణగకపోవడంతో స్పకర్ కిరణ్ కుమార్ రెడ్డి సభను వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications