జూ. ఎన్టీఆర్ కు కోర్టు సమన్లు
విజయనగరం: ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు విజయనగరం జిల్లా కొత్తవలస న్యాయస్థానం గురువారం సమన్లు జారీ చేసింది. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తూ నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై దాఖలైన కేసులో కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
ఉత్తరాంధ్రలో ప్రచారాన్ని ముగించుకుని ఆయన ఖమ్మం జిల్లాలో ప్రచారం సాగించారు. తెల్లారి ఉగాది పర్వదినం అనగా హైదరాబాదుకు బయలుదేరారు. ప్రయాణంలో ప్రమాదానికి గురై జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డారు. దాని నుంచి కోలుకుని ఆయన తిరిగి సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications