తెలుగుదేశంలోకి దేవేందర్ గౌడ్
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసిన టి. దేవేందర్ గౌడ్ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఆయన గురువారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ఇ. పెద్దిరెడ్డి కూడా తెలుగుదేశంలో చేరుతారు. దాదాపు 20 మంది దేవేందర్ తో పాటు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది.
దేవేందర్ ను తిరిగి పార్టీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నచ్చజెప్పినట్లు సమాచారం. అలాగే, దేవేందర్ గౌడ్ కూడా తలసాని శ్రీనివాస యాదవ్ తో మాట్లాడినట్లు చెబుతున్నారు. దీంతో తలసాని శ్రీనివాస యాదవ్ దేవేందర్ గౌడ్ రాకకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేవేందర్ గౌడ్ ను చేర్చుకుంటే రాజీనామా చేస్తానని చెప్పిన ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు చెబుతున్నారు. దేవేందర్ రాకను వ్యతిరేకిస్తున్న మరో నాయకుడు, ఆయన బంధువు అరవింద కుమార్ గౌడ్ ను కూడా బుజ్జగించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications