గౌడ్ చేరాక చూస్తా :తలసాని
హైదరాబాద్: పార్టీలో టి. దేవేందర్ గౌడ్ చేరిన తర్వాత తాను రాజీనామా చేస్తానని తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. దేవేందర్ గౌడ్ ను పార్టీలో తిరిగి చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయన గురువారం ఉదయం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో సమావేశమయ్యారు. తలసానికి నచ్చజెప్పేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీకి క్షమాపణ చెప్పాలని మాత్రమే తాను దేవేందర్ గౌడ్ ను డిమాండ్ చేస్తున్నానని ఆయన చెప్పారు.
తాను సిద్ధాంతాలకు కట్టుబటి ఉండే వ్యక్తినని ఆయన అన్నారు. దేవేందర్ గౌడ్ ను చేర్చుకోవద్దని తాను అనడం లేదని, అయితే దేవేందర్ గౌడ్ పార్టీనుంచి వెళ్లిపోయిన సమయంలో తీవ్రమైన ఆరోపణలు చేశారని, పార్టీకి క్షమాపణ చెప్పకపోతే ఎవరికి చెప్తారని ఆయన అన్నారు. తాను అన్ని విషయాలు పార్టీకి చెప్పినట్లు ఆయన తెలిపారు. తాను బుధవారం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో కలిసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తే ఏ పార్టీలో కూడా చేరబోనని ఆయన అన్నారు. మీడియాపై ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications