ముంబై పేలుళ్లు: 3గురికి మరణశిక్ష
ముంబై : ముంబై జంట పేలుళ్ల కేసులో ముగ్గురు దోషులకు పొటా ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. ఆరేళ్ల పాటు కేసు విచారణ జరిగింది. గురువారం నాడు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి దోషులకు శిక్షను ఖరారు చేశారు. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, జావేరీ బజారుల్లో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో 53 మంది మరణించిన విషయం తెలిసిందే. మొహమ్మద్ హనీఫ్ సయీద్, అతని భార్య ఫహిమిదా, అష్రాత్ సఫీక్ అన్సారీలకు కోర్టు మరణశిక్ష విధించింది.
ఇది అరుదైన కేసుల్లో అరుదైన కేసు అని ప్రాసిక్యూషన్ న్యాయవాది అన్నారు. అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడినందున ముగ్గురు నిందితులకు కూడా మరణశిక్ష విధించాలని కోరారు. ముగ్గురు నిందితులకు శిక్ష పడడం లష్కరే తోయిబాకు పెద్ద దెబ్బ అని 2003 ముంబై జంట పేలుళ్ల కేసు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖం అన్నారు. ఈ నిందితులతో పాటు కొంత మంది పాకిస్తానీ జాతీయులు దుబాయ్ లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు సాక్షి చెప్పారు.












Click it and Unblock the Notifications