ఎర్రబెల్లి ఎపిసోడ్: టిడిపి వాకౌట్

Kiran Kumar Reddy
హైదరాబాద్: తమ సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సభ్యులు బుధవారం శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేయాలని, ఎర్రబెల్లి దయాకరరావు సస్పెన్షన్ ను ఎత్తేయాలని ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా నిరసించారు. స్పీకర్ తమ హక్కులను కాపాడడం లేదని ఆయన విమర్శించారు. స్పీకర్ నిస్సహాయుడిగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దానికి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిస్పందిస్తూ తాను సభ్యుల హక్కులు కాపాడుతున్నానని, ప్రభుత్వానికీ ప్రతిపక్షానికీ మధ్య వ్యవహారంలో స్పీకర్ ను లాగవద్దని ఆయన చంద్రబాబుకు సూచించారు.

ఎర్రబెల్లి దయాకరరావు అసభ్యమైన పదజాలం ఏదీ వాడలేదని చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేసిన తర్వాత తమ సభ్యుడు రా, బయటకు రా, చూసుకుందామని అన్నాడని మిగతా ప్రతిపక్షాల నాయకులు చెప్తే బేషరతుగా క్షమాపణ చెప్పిస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వం సభలో వ్యవహరిస్తున్న తీరు తమ గొంతులు నొక్కేలా ఉందని ఆయన విమర్శించారు. బ్రాహ్మణి స్టీల్స్ వ్యవహారం చర్చకు వస్తుందనే ఉద్దేశంతో దాన్ని రాకుండా చూడడానికి ప్రభుత్వం పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. సభలో ప్రజాసమస్యలు చర్చకు రావాల్సి ఉందని, ప్రజా సమస్యలు చర్చకు రావాలనే ఉద్దేశంతోనే తాము సంయమనం పాటించి సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నారని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారని, అసత్యాలు చెప్పడం ముఖ్యమంత్రి హోదాకు తగింది కాదని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి తీరును మంత్రులు రోశయ్య, ఎన్ రఘువీరా రెడ్డి సమర్థించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+