వైయస్ రెచ్చిపోయారు: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రెచ్చిపోయి మాట్లాడారని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎర్రబెల్లి దయాకరరావు అసభ్య పదజాలం వాడలేదని ఆయన బుధవారం శాసనసభలో చెప్పారు. తమ సభ్యుల గురించి మంత్రులు రోశయ్య, రఘువీరా రెడ్డి దారుణమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయని ఆయన అన్నారు. ఎవరైనా సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తే స్పీకర్ సూచన చేసి నియంత్రించాలని, కానీ ముఖ్యమంత్రి రెచ్చిపోయి మాట్లాడారని ఆయన అన్నారు. తన మాటలకు ముఖ్యమంత్రి విచారం కూడా వ్యక్తం చేయలేదని ఆయన అన్నారు. రోశయ్య లాంటి పెద్దవారు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని, అటువంటివారు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఎర్రబెల్లి దయాకరరావు సస్పెన్షన్ వ్యవహారాన్ని స్పీకర్ విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు.

అధికార, ప్రతిపక్ష సభ్యుల నుంచి కూడా రన్నింగ్ కామెంటరీలు సాగుతున్నాయని లోకసత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రతిపక్ష సభ్యులు రెచ్చగొట్టిన సంయమనం పాటించాల్సిన బాధ్యత అధికార పక్షానికి ఉందని ఆయన అన్నారు. ప్రతిపక్ష సభ్యుల నుంచి కవ్వింపు చర్యలు చేపట్టినా సంయమనం పాటించాల్సిన బాధ్యత అధికార పక్షానిదే అని ఆయన అన్నారు. ఎర్రబెల్లి దయాకర రావు అసభ్యకర పద జాలం ఏదీ వాడలేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+