రౌడీనైతే ఆమోదించండి: ఎర్రబెల్లి

చేనేత కార్మికులపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి పరిష్కారమేదైనా చెపుతారేమోనని అనుకున్నానని, అయితే ముఖ్యమంత్రి ఎదురు దాడికి దిగారని ఆయన అన్నారు. తాను విషయం తప్ప మరేదీ మాట్లాడలేదని ఆయన అన్నారు. అంశంపై ఏదో ఒకటి మాట్లాడడం పరిపాటేనని ఆయన చెప్పారు. ఈ రోజు కన్నా తీవ్రంగా గతంలో కూడా తాము మాట్లాడామని ఆయన చెప్పారు. ఆర్థిక మంత్రి కె. రోశయ్య తన మాటలను వక్రీకరించారని ఆయన అన్నారు. రా, బయటకు రా, చూసుకుందామని తాను అన్నట్లు ముఖ్యమంత్రి చెబుతున్నారని, తాను అలా అనలేదని ఆయన అన్నారు.
తాను ముఖ్యమంత్రి నుంచి క్షమాపణ కోరడం లేదని, ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరిస్తే చాలునని ఆయన అన్నారు. తన జీవితంలో ఇటువంటి సంఘటన ఏ రోజు కూడా జరగలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications