అసెంబ్లీ నుంచి ఎర్రబెల్లి సస్పెన్షన్

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలుగుదేశం సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావును స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం రెండు రోజుల పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్ ఆయనను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ అనంతరం ఆయన సభ నుంచి వెళ్లిపోలేదు. తెలుగుదేశం సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ దయాకరరావు సభ నుంచి వెలుపలికి వెళ్లలేదు.

సభా సంప్రదాయాలను కాపాడి సభనుంచి వెళ్లిపోవాలని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి దయాకరరావును ఆదేశించారు. దయాకర రావు వెళ్లిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వారికి మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని, సస్పెండ్ అయిన సభ్యుడు సభలో ఉండగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం సంప్రదాయం కాదని స్పీకర్ అన్నారు. తెలుగుదేశం నిరసనల మధ్య సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వ్యక్తిగతంగా శాసనసభ్యుడిగా దయాకరరావును సస్పెండ్ చేసినట్లు, పార్టీ తరఫున కాదని స్పీకర్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+