ఎర్రబెల్లి గొంతు వింటే భయం: సిఎం

కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను తాను గమనిస్తున్నానని, ఎన్నడూ జరగని సంఘటనలు ప్రస్తుతం సభలో జరుగుతున్నాయని ఆయన అన్నారు. రా, బయటకు రా, చూసుకుందాం అని దయాకరరావు అన్నట్లు ఆయన చెప్పారు. దయాకరరావుతో బేషరతుగా క్షమాపణ చెప్పిస్తే తాను విచారం వ్యక్తం చేస్తానని ఆయన చెప్పారు. కొన్ని పద్ధతులు పాటించకపోతే సభను నడుపుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు. తాను ఏకవచనంలో మాట్లాడనని చంద్రబాబు అంటున్నారని, తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, రౌడీలా మట్లాడుతున్నావు, ఏంటయ్యా అనవసర రాద్ధాంతమని మాత్రమే తాను అన్నానని, అయ్యా అంటే తప్పు కాదని, అది గౌరవించడమేనని ముఖ్యమంత్రి వివరించారు. సభ్యుల ప్రవర్తనతో సభ నడుపుకోలేనప్పుడు వారిని సస్పెండ్ చేయడం తప్పు కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications