జగన్ కోసం సోనియాతో ఎంపీలు

Sonia Gandhi
న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్రానికి చెందిన పార్టీ పార్లమెంటు సభ్యులు మంగళవారం కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని విడివిడిగా కలుస్తారు. వారు సోనియా వద్ద తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. మెజారిటీ పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు. వారు మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఎపి భవన్ లో రాజ్యసభ సభ్యుడు, వైయస్ ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావును కలుసుకున్నారు.

రామచందర్ రావును పార్టీ అధిష్టానవర్గం ఢిల్లీకి పిలిపించడంతో ముఖ్యమంత్రి పదవి వ్యవహారం రాష్ట్రం నుంచి అక్కడికి చేరింది. రాష్ట్ర ఎంపీలు సోనియాను కలిసి సిఎం వ్యవహారంపైనే కాకుండా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కూడా మాట్లాడుతారని తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన లగడపాటి రాజగోపాల్ వంటి పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. వారు ఇతర వర్గాల మద్దతును కూడగట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే తెలంగాణకు చెందిన వి హనుమంతరావు వంటి నాయకులు అందుకు వ్యతిరేకంగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+