ఆంధ్ర ఎంపీలపై సోనియా ఆగ్రహం

కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారాన్ని రెండు రోజుల్లో తేలుస్తామని సోనియా హామీ ఇచ్చినట్లు ఎంపీ రాయపాటి సాంబశివ రావు చెప్పిన మాటల్లో కూడా నిజం లేదని అంటున్నారు. వారు చెప్పేదంతా సోనియా విన్నారు తప్ప ముఖ్యమంత్రి ఎంపికపై ఏ మాటా మాట్లాడలేదని చెబుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్ర నాయకులు పెడుతున్న ఒత్తిడి పట్ల ఆమె కొంత చిరాకుగా ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు కూడా ముగియక ముందే రాష్ట్రంలో జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రచారం మొదలు కావడం పట్ల కూడా ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications