జగన్ సిఎం కావాలి: రోజా

తనపై తెలుగుదేశం పార్టీ నాయకులు దుష్ప్రచారం చేశారని, తనపై వారు చేసిన వ్యాఖ్యల వల్లనే తనకు మనస్తాపం కలిగిందని ఆమె అన్నారు. వారు పంపిన మెసేజ్ వల్లనే గంగా భవానీ వంటి కాంగ్రెసు నాయకులు కూడా తనపై దురభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆమె అన్నారు. తాను తన భర్త, సోదరుడి అభిప్రాయాలు తీసుకున్నప్పటికీ సొంత నిర్ణయాలే తీసుకుంటానని, కాంగ్రెసులో చేరాలనేది తన సొంత నిర్ణయమేనని ఆమె అన్నారు. సినీ కళాకారులకు ఆత్మగౌరవం ఉంటుందని, వారికి డబ్బుకు, కీర్తికి లోటుండదని, వారు రాజకీయంలోకి వచ్చి ఆశించేదేమీ ఉండదని ఆమె అన్నారు. వైయస్ తో 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత తన అభిప్రాయం మారిందని, తాను కాంగ్రెసు పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చానని, నిజానికి తాను కాంగ్రెసులో చేరాలని వైయస్ కలవలేదని, కలిసిన తర్వాతనే తన అభిప్రాయం మారిందని ఆమె వివరించారు.












Click it and Unblock the Notifications