ఇంటలిజెన్స్ చీఫ్ మనస్తాపం

వైయస్ హెలికాప్టర్ ప్రమాదం నేపథ్యంలో డిజిపి ఎస్ఎస్పీ యాదవ్, ఇంటలిజెన్స్ చీఫ్ అరవిందరావులను తొలగించవచ్చుననే వార్తలు వచ్చాయి. అయితే డిజిపిని తొలగించే ఆలోచన లేదని ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. అయితే అరవింద రావు మాత్రం తనను ఆ పదవి నుంచి తప్పించాలని కోరినట్లు సమాచారం. కొందరు పని కట్టుకుని తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని అరవిందరావు బాధపడుతున్నట్లు సమాచారం. ఇది వరకు కొంత మంది ఐపియస్ అధికారులు అరవింద రావుపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆయన గత ఐదున్నరేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications