జగన్ కోసం జయసుధ ర్యాలీ

Jayasudha
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ సికింద్రాబాద్ కాంగ్రెసు శాసనసభ్యురాలు, సినీనటి జయసుధ గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సికింద్రాబాద్ నుంచి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు సాగింది. కార్యకర్తలతో ఆమె ఈ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె జగన్ ను పరామర్శించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, తామంతా జగన్ వెంటే ఉన్నామని జయసుధ మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి జయసుధను కాంగ్రెసు పార్టీలోకి తీసుకొచ్చి సికింద్రాబాద్ శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీకి దించారు. ఆమె మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్ పై గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+