తిరుపతి: ముఖ్యమంత్రి కె.రోశయ్యకు మంత్రులు సహకరించడం లేదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. అపారమైన అనుభవం ఉన్న రోశయ్యకు మంత్రులు సహకరిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తన నియోజకవర్గం తిరుపతి పర్యటనకు ఆయన శుక్రవారం వచ్చారు. రాష్ట్రంలో విషజ్వరాల నివారణకు ప్రభుత్వం చొరవ చూపడం లేదని ఆయన విమర్శించారు.
తిరుపతిలోని అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.