సిఎంగా జగన్ సమర్థుడు: నాగ్

Nagarjuna
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమర్థుడని సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. ఆయన శుక్రవారంనాడు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావును కలిశారు. ముఖ్యమంత్రి కావడానికి వైయస్ జగన్ కు అన్ని అర్హతలున్నాయని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిలో ఉన్న అర్హతలన్నీ జగన్ లో ఉన్నాయని, తండ్రి ఆశయాలను నెరవేర్చే సత్తా జగన్ కు ఉందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించారంటే నమ్మశక్యం కాకుండా ఉందని ఆయన అన్నారు. వైయస్ మరణంతో రాష్ట్రం అనాథ అయిందని ఆయన వ్యాఖ్యానించారు.

కెవిపిని తాను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఆయన తెలిపారు. కెవిపి తనకు మంచి మిత్రుడని, ఇన్నాళ్లు కెవిపి తీరిక లేకుండా ఉన్నారని, దాంతో కలువలేకపోయానని ఆయన చెప్పారు. కాంగ్రెసు అధిష్ఠాన వర్గం జగన్ వైపు మొగ్గు చూపుతోందని కెవిపి తనతో అన్నట్లు ఆయన తెలిపారు. వైయస్ లేని లోటును పూడ్చాలంటే జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అంతక ముందు మంత్రులు వట్టి వసంతకుమార్, పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసనసభ్యుడు జోగి రమేష్ కెవిపిని కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+