చిరు పార్టీలో ఎమ్మెల్యేల చిచ్చు

ప్రజారాజ్యం పార్టీకి 18 మంది శాసనసభ్యులున్నారు. వీరిలో కొంత మంది దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అనుకూలంగా ఉన్నారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. శోభా నాగిరెడ్డి వంటి శాసనసభ్యులు ఎప్పుడైనా కాంగ్రెసులోకి వెళ్లిపోవచ్చునని ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఆమెతో పాటు మిగతా శాసనసభ్యులు ఆ ఊహాగానాలను ఖండించారు. ప్రజారాజ్యం పార్టీలో వైయస్ అనుచర గణం ఉందని తాజా వివాదం బయటపెడుతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications