వ్యాధులపై శ్రద్ధ పెట్టండి: రోశయ్య

వైయస్ అభయహస్తం పథకంలో భాగంగా నవంబర్ 1వ తేదీ నుంచి వారంపాటు పింఛన్లు పంపిణీ చేయాలని మంత్రి వర్గం నిర్ణయించినట్లు సమాచార శాఖ మంత్రి జె.గీతారెడ్డి చెప్పారు. మంత్రి వర్గ సమావేశం వివరాలను ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. మహిళలపై యాసిడ్ దాడులను అరికట్టేందుకు ఆర్డినెన్స్ రూపంలో చట్టం తేవాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. చేనేత విధివిధానాలపై మంత్రివర్గంలో చర్చించినట్లు ఆమె చెప్పారు.
కర్నూలు జిల్లా ఆత్మకూరులోని నల్లకాలువ సమీపంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఐదు లక్షల రూపాయలతో కాలినడక దారి ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వైయస్ విగ్రహాన్ని స్థాపించాలని కూడా నిర్ణయించినట్లు గీతారెడ్డి తెలిపారు. ఇందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించినట్లు ఆమె తెలిపారు. జిల్లాల్లో వైయస్ విగ్రహాల ఏర్పాటుపై జిల్లా స్థాయిల్లోనే నిర్ణయం తీసుకోవాలని మంత్రి వర్గం అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications