పాగో పాగో: శక్తివంతమైన సునామీ మంగళవారం ఉదయం సమోవా, అమెరికన్ సమోవాను తాకింది. దీంతో పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. దీని వల్ల 34 మంది మరణించగా, ఎంతో మంది కార్మికులు మాయమయ్యారు. నేషనల్ పార్కు సర్వీస్ సౌకర్యాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. కార్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. ప్రజలు కొట్టుకుపోయారు.
కమ్యూనికేషన్ సౌకర్యాలు దెబ్బ తినడంతో జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.0, 8.3గా నమోదైంది. సముద్రంలోపల 32 కిలోమీటర్ల లోతులో ఇది చోటు చేసుకుంది.