నేనేమీ మాట్లాడను: రోశయ్య

Konda Surekha
హైదరాబాద్: రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలపై తానేమీ మాట్లాడబోనని ముఖ్యమంత్రి కె.రోశయ్య చెప్పారు. ముఖ్యమంత్రిగా రోశయ్య పనికి రారని సురేఖ అన్నారు. తమకు అధికారులకు మాదిరిగా పని చేయడానికి నిర్దిష్టమైన వేళలు ఉండవని, దాంతో ఏవో చేస్తుంటామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం రాష్ట్రంలో సంభవించిన ప్రజల మరణాలపై కూడా తాను బహిరంగంగా ఏమీ మాట్లాడబోనని ఆయన చెప్పారు. మరణాలన్నీ బోగస్ అని సీనియర్ కాంగ్రెసు నేత వి.హనుమంతరావు చేసిన ప్రకటనపై తాను ఏమీ వ్యాఖ్యానించబోనని ఆయన అన్నారు. తన అభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠానానికే చెబుతానని ఆయన అన్నారు.

రాష్ట్రంలోని ఐదు జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎన్నికైన వారిని ఆయన అభినందించారు. ఈ విజయంతో భవిష్యత్తులో ప్రజల కోసం మరింత అంకితమై ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి దూరమైన తర్వాత వచ్చిన ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోగలమా లేదా అనే సందేహం కలిగిందని, వైయస్ దూరమైన తర్వాత కూడా కాంగ్రెసు పై అభిమానంతో ప్రజలు తమ పార్టీని గెలిపించారని ఆయన అన్నారు. సోనియా గాంధీ సమర్థ నాయకత్వం తమకు విజయాలను అందిస్తుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోకసభ స్థానాల్లో 41 స్థానాలు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి లేకపోయినా ఆయన స్ఫూర్తి సజీవంగానే ఉందని రోశయ్య వ్యాఖ్యానించారు. సోనియా నాయకత్వంలో మన్మోహన్ సింగ్ సమర్థ పాలన అందిస్తున్నారని, అది కాంగ్రెసుకు బలం చేకూరుస్తుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+