వైయస్ జగన్ మాతోనే ఉంటారు: డి శ్రీనివాస్

Srinivas
హైదరాబాద్: వైయస్ జగన్ కాంగ్రెసుతోనే ఉంటారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. బహిరంగ ప్రకటనలు చేయవద్దని, విమర్శలకు దిగవద్దని జగన్ కూడా చెబుతున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పార్టీ నాయకులు విమర్శలు, ప్రతివిమర్శలకు దిగవద్దని ఆయన పార్టీ నాయకులను హెచ్చరించారు. రాజీనామా చేస్తామని ఎవరు కూడా అనవద్దని ఆయన అన్నారు. పార్టీ విధానాలను, పార్టీ హద్దులను దాటితే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. తనను, సిడబ్ల్యుసి సభ్యులపై కూడా విమర్సలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరినీ ఏమీ అనడం లేదని, నాయకత్వ మార్పు విషయంపై తాను మాట్లాడడం లేదని, అయినా తనపై కూడా విమర్శులు చేస్తున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే సహించేది లేదని ఆయన అన్నారు. పార్టీ నాయకుల వ్యవహార శైలి వల్ల పార్టీపై ప్రజల్లో గౌరవం సన్నగిల్లుతుందని ఆయన అన్నారు. ఇతర పార్టీలు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ పై పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోందని, మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పార్టీ అధిష్టానం నాయకులు తీరిక లేకుండా ఉన్నారని, అధిష్ఠానంతో సహకరించాలని ఆయన అన్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అందరూ చెబుతూనే ఉన్నారని, అయితే టీవీ చానెళ్లు ముందుకు రాగానే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారని ఆయన అన్నారు. జగన్ కూడా పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. మనం చేసే పని వల్ల పార్టీ ప్రతిష్ట పెరగాలని ఆయన అన్నారు. ప్రజలు మన ప్రవర్తనను ప్రశంసించాలని, పార్టీ గౌరవం పెరగాలని ఆయన అన్నారు. ఎవరు కూడా సొంత బలం మీద విజయం సాధించలేదని, పార్టీ టికెట్ మీదనే గెలిచారని, పార్టీ అభ్యర్థుల ఎంపికకు ఎంతో కసరత్తు జరిగిందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ శాంతికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. అందరం కలిసి ముందుకు సాగితేనే పార్టీ బలపడుతుందని ఆయన అన్నారు. ఢిల్లీలో చక్కని నాయకత్వం ఉందని, ఆ నాయకత్వాన్ని బలపరిచేలా వ్యవహరించాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+