శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు వీరిపై గురువారం ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.దాంతో జిల్లా ఎస్పీ నాగన్న ఇద్దరు కానిస్టేబుళ్లు రవి, శ్రీనివాస్ లను విధుల నుంచి సస్పెండ్ చేశారు. వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు. కాగా బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.