వరదలో చిక్కుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

కర్నూలు జిల్లా వరద బీభత్సంతో అతలాకుతలమైంది. గాజుల దిన్నె ప్రాజెక్టుకు గండి పడింది. దాని కింది గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. సుంకేశుల ప్రాజెక్టుకు కూడా గండి పడింది. సహాయక చర్యల కోసం వెళ్లిన పది మంది ఇంజినీర్లు సుంకేశుల ఆనకట్టపైన చిక్కుకుపోయారు. మంత్రాలయంలో 12 వేల మంది భక్తులు చిక్కుకుపోయారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు కూడా గండి పడింది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలోకి నీరు చేరుతోంది. ప్రమాద స్థాయిలో రెండు విద్యుత్కేంద్రాలు కూడా చిక్కుకున్నాయి. మంత్రాలయంలో ఉన్న ఒకే ఒక ఎత్తయిన భవనంపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications