మరింత చురుగ్గా కదలండి: బాబు

గత వందేళ్లలో ఇంతటి వరదలు ఎప్పుడూ రాలేదని, ఇటువంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా తగిన విధంగా ముందుకు రావాలని ఆయన అన్నారు. రాష్ట్రానికి ఇంకా వరద ముప్పు తగ్గలేదని ఆయన అన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానదికి పెద్ద యెత్తున నీరు వచ్చి చేరుతోందని, ప్రమాదాన్ని తట్టుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కృష్ణానది కరకట్టలు తెగితే తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని ఆయన అన్నారు. విజయవాడకు పెద్ద యెత్తున ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం చేయాల్సింది ప్రజల ఇబ్బందులు తగ్గించడమేనని, ఇందుకు ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించడం అవసరమని ఆయన అన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి వెంటనే కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాస్తవ పరిస్థితులను ముందు పెట్టాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications