ప్రజలను జలసర్పం కాటేసింది

Floods
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు జిల్లాలు వరద తాకిడికి విలవిలలాడాయి. ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. దేవుడిపై భారమేసి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వేలాది మంది జాడ తెలియడం లేదు. కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలను జలప్రళయం ముంచేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో లక్షా 32 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కృష్ణా నది తీర ప్రాంత గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. కర్నూలు జిల్లాలో దాదాపు 30 మండలాలు కోలుకోలేకుండా దెబ్బ తిన్నాయి. బెంగుళూర్, హైదరాబాదులకు వెళ్లే దారులు మూసుకుపోయాయి. కృష్ణా, తుంగభద్ర నదుల్లో నీరు పోటెత్తింది. వందేళ్లలో ఇదే పెద్ద వరద అని భావిస్తున్నారు. కృష్ణానదికి ఇంత పెద్ద వరద నీరు 106 ఏళ్ల క్రితం వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద 20 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతుండడంతో ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు.

కర్నూలు, మంత్రాలయం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందల మంది గల్లంతయ్యారు. కర్నూలు జిల్లాలోనే 700 మంది జాడ కనిపించడం లేదు. వరద నీటిలో చిక్కుకుని వేలాది మంది సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. తుంగభద్ర నది వరదకు కర్నూలు జిల్లా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో చిమ్మ చీకట్లో గ్రామాలు రాత్రంతా గడపాల్సి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాలో గోడ కూలి ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో పది మంది గల్లంతయ్యారు. పంట నష్టం అపారంగా సంభవించింది. రాయలసీమకు వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి. కర్నూలు జిల్లా సంద్రాన్ని తలపిస్తోంది. కర్నూలు జిల్లాలోని 12 మండలాల్లో వందలాది గ్రామాలు నీట మునిగాయి. పోతిరెడ్డిపాడు పాడు వద్ద అతిథిగృహంలోకి నీరు చేరాయి. ముఖ్యమంత్రి కె. రోశయ్య రాత్రంతా సచివాలయంలోనే ఉండి వరద పరిస్థితిని, సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+