సహాయ చర్యలు ముమ్మరం: రోశయ్య

దేవుడి దయవల్ల ప్రజలు వరద ముప్పు నుంచి బయటపడ్డారని ఆయన అన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 120 మర పడవలను నియోగించినట్లు ఆయన తెలిపారు. పైన వర్షాలు పడకుండా ఉంటే, ఎగువ నుంచి వరద నీరు రాకపోతే పూర్తిగా కోలుకుంటామని ఆయన చెప్పారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్నాటకల్లోని ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయవద్దని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు ఆయన తెలిపారు.
రోశయ్య రాత్రి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీలకు ఫోన్ చేసి వరద పరిస్థితిని వివరించారు. కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీలతో కూడా ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి తగిన సహాయం అందిస్తామని ప్రధాని రాష్ట్రానికి హామీ ఇచ్చారు. వరద తాకిడి ప్రాంతాలను సందర్శించడానికి మన్మోహన్ గానీ సోనియా గానీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications