మానవ వైఫల్యం లేకుండా..: రోశయ్య

వరద తాకిడి ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వెళ్లాలని తాను అనుకున్నానని, అయితే వాతావరణం సరిగా లేకపోవడంతో సాధ్యం కాలేదని ఆయన చెప్పారు. ఎక్కువ కాల్స్ రావడం వల్ల హెల్ప్ లైన్లు సరిగా పనిచేయలేదని ఆయన చెప్పారు. వరద తాకిడి ప్రాంతాల్లోని ప్రజలకు మంచినీరు అందించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నియోజక వర్గాల వారీగా వరద పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీశైలం నుంచి 25 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గుతోందని ఆయన చెప్పారు. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు.
వరద తాకిడి ప్రాంతాల్లో బ్లీచింగ్, క్లోరినేషన్ చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు నాలుగు వేల రూపాయలేసి, పాక్షికంగా ధ్వంసమైన ఇళ్లకు మూడు వేల రూపాయలేసి నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం మంజూరు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications