హక్కుల నేత బాలగోపాల్ కన్నుమూత

K Balagopal
హైదరాబాద్: హక్కుల ఉద్యమం ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. హక్కుల ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన కె.బాలగోపాల్ గురువారం రాత్రి మరణించారు. ఆయనకు 57 ఏళ్లు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన ఆకస్మిక మరణం ప్రజా సంఘాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. హైదరాబాదులోని గుడి మల్కాపూర్ లో ఉంటున్న బాలగోపాల్ కు గురువారం రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆయన రాత్రి ఆస్పత్రిలో మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని రాత్రి 12 గంటల ప్రాంతంలో నివాసానికి చేర్చారు.

పౌర హక్కుల ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన బాలగోపాల్ రచయిత, మేధావి. ఆయన మానవ హక్కులపై, ఆర్థికాంశాలపై ఎన్నో వ్యాసాలు రాశారు. హక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టారు. నక్సల్బరీ ఉద్యమం, గమ్యం గమనం గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. ఆయన రాసిన రూపం - సారం సాహిత్యలోకంలో అనన్య సామాన్య గ్రంథంగా నిలుస్తుంది. ఆయన అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురం గ్రామంలో 1957 జన్మించారు. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఎపిసిఎల్సీ)కి గుండెకాయగా నిలిచిన ఆయన తదుపరి దాంతో విభేదించారు. మానవ హక్కుల వేదికను స్థాపించి పని చేయడం ప్రాంరభించారు.

వరంగల్ లోని రీజినల్ ఇంజినీరింగ్ కళాశాలలో గణితంలో పిహెచ్డీ చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరారు. 1985లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలం హక్కుల ఉద్యమానికి అంకితమయ్యారు. అప్పటి నుంచి హైదరాబాదును కేంద్రంగా చేసుకుని రాజ్యహింసపై నిరంతరం పనిచేసుకుంటూ వచ్చారు.రాష్ట్రంలో ఆయన తిరగని తెలంగాణ పల్లె లేదంటే అతిశయోక్తి లేదు. బెదిరింపులను, నిర్బంధాన్ని లెక్క చేయకుండా ఆయన పని చేశారు. బుద్ధిజీవిగా, కార్యశీలిగా ఆయన రెండు బాధ్యతలూ మోశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+