పబ్లిక్ గార్డెన్స్ లో ఉరేసుకుంటా: కెసిఆర్

తనవి వరద రాజకీయాలని అనడాన్ని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. వైయస్ రాజశేఖర రెడ్డి శవం హైదరాబాదుకు కూడా రాక ముందే కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ముఖ్యమంత్రి పదవి కోసం శవ రాజకీయాలు చేశారని ఆయన విమర్శించారు. దిక్కుమాలిన శవ రాజకీయాలు కాంగ్రెసు పార్టీవేనని ఆయన అన్నారు. ఉన్న మాట మాట్లాడితే రాజకీయాలు అంటున్నారని ఆయన అన్నారు. మన నీళ్ల కోసం, మన భూమి కోసం, మన గాలి కోసం అడిగితే రాజకీయాలంటున్నారని ఆయన అన్నారు. కృష్ణానదీ జలాల్లో 68 శాతం తెలంగాణ వాటా అని, 13.5 శాతం మాత్రమే కోస్తాంధ్రదని ఆయన అన్నారు. తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేస్తున్నది కాంగ్రెసు నాయకులేనని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాల్లో ఖర్చు కోసం తన ఎంపిల్యాడ్స్ నిధులు 2 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి ప్రకటించిన రాష్ట్రంలోని ఏకైక పార్లమెంటు సభ్యుడ్ని తానే అని ఆయన చెప్పారు. నష్టపోయినవారందరికీ ఇళ్లు కట్టించే వరకు విశ్రమించబోనని, అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని, హైదరాబాదులోని భవంతి అమ్మైనా ఇళ్లు కట్టిస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications