జాబిల్లిని ఢీకొన్న నాసా రాకెట్

Moon
న్యూఢిల్లీ: అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా ప్రయోగించిన రాకెట్ చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఢీకొట్టింది. శుక్రవారం ఉదయం ఆ సంస్థ రాకెట్ ను చంద్రుడిపైకి రాకెట్ ను ప్రయోగించింది. చంద్రుడి ఉపరితలంపై గల మట్టిలో, రాళ్లురప్పల్లో ఏ మేరకు నీరు లేదా మంచు ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి నాసా ఈ ప్రయోగం చేసింది. ఈ బాంబింగ్ మిషన్ వ్యయం 79 మిలియన్ డాలర్లు. రాకెట్ ప్రయోగించడంతో జాబిల్లిపై ధుమ్ము, ధూళీ ఎగిసిపడ్డాయి.

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ - 1 చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. అమెరికా, భారత శాస్త్రవేత్తలు చంద్రయాన్ పంపిన చిత్రాలను విశ్లేషించి ఆ నిర్ధారణకు వచ్చారు. అమెరికా ప్రయోగం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని విమర్శలు వస్తున్నాయి. అయితే వాటిని నాసా తోసిపుచ్చుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+