తెలంగాణ సాధనే అంతిమ లక్ష్యం: నాయని

తమ ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో తాము జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ జిల్లాలో జైల్ భరో కార్యక్రమానికి మంచి స్పందన ఉందని ఆయన చెప్పారు. ఉద్యమాన్ని తాము శాంతియుతంగా నిర్వహిస్తామని, ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా చూస్తామని, ఇందుకు పోలీసులు కూడా సహకరించాలని ఆయన అన్నారు. జైల్ భరో కార్యక్రమం సందర్భంగా హైదరాబాదులోని సచివాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన నాయకులను, కార్యకర్తలను విడుదల చేయాలని తెరాస డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications