కర్నాటకలో యెడ్యూరప్పకు ఎదురు'గాలి'

Yeddyurappa
బెంగుళూర్: కర్నాటకలో ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మంత్రులు గాలి సోదరుల లాబీ ఆయనకు ఎదురు తిరిగింది. బళ్లారి గనుల లాబీ ఆయనను వ్యతిరేకిస్తోంది. యెడ్యూరప్పకు వ్యతిరేకంగా మంత్రి సోదరులు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, వారి అనుంగు మిత్రుడు, మరో మంత్రి శ్రీరాములు యెడ్యూరప్పపై తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నారు. మొత్తం ఏడుగురు మంత్రులు అసమ్మతి రాగం అందుకున్నారు. తమకు 25 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని వారు చెబుతున్నారు. యెడ్యూరప్ప ఏక పక్ష వైఖరి, గనుల లాబీ ఆశలు కలగలసి కర్నాటకలో బిజెపి ప్రభుత్వానికి ఎసరు పెట్టాయి.

ఉత్తర కర్నాటకలో వరద సహాయక చర్యల బాధ్యతను సీనియర్ ఐఎఎస్ అధికారి జామ్ దార్ కు, నిర్వాసితులకు ఇళ్లు నిర్మించే కార్యక్రమం ఆసరా బాధ్యతలను తన సన్నిహిత మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ కు యెడ్యూరప్ప అప్పగించారు. నిజానికి వరద సహాయక చర్యలు రెవెన్యూ శాఖ అధ్వర్యంలో జరగాలి. రెవెన్యూ శాఖ మంత్రి అయిన గాలి కరుణాకర్ రెడ్డికి తెలియకుండానే ముఖ్యమంత్రి ఆ బాధ్యతలను అప్పగించారు. దీంతో గాలి సోదరులు తీవ్ర ఆగ్రహానికి గురై అసమ్మతి బావుటా ఎగురేశారు. అంతేకాకుండా ఇనుప ఖనిజ రవాణాపై అభివృద్ధి సుంకం విధించాలని ఈ నెల 13వ తేదీన జరిగిన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం కూడా గాలి సోదరులకు మింగుడు పడలేదు.

గాలి సోదరుల తిరుగుబాటు నేపథ్యంలో యెడ్యూరప్ప మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 34 మంత్రుల్లో 22 మంది హాజరయ్యారు. ముఖ్యమంత్రి రాజీకి ప్రయత్నిస్తున్నా అసమ్మతి నేతలు ససేమిరా అంటున్నారు. ముఖ్యమంత్రిగా శాసనసభ సభాపతి జగదీశ్ శెట్టర్ కు అసమ్మతి నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. శెట్టర్ తో కరుణాకర్ రెడ్డి తదితరులు చర్చలు జరిపారు. వచ్చే నెల 2వ తేదీన హోస్పేటలో నిర్వహించే సభ ద్వారా బలప్రదర్సన చేయాలని అసమ్మతి నేతలు సంకల్పించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+