'గాలి' ఓబుళాపురంపై చర్యకు బాబు డిమాండ్

ఏ విధమైన అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని ఆయన అన్నారు. అక్రమాలు జరుగుతున్న రాష్ట్ర మైనింగ్ శాఖ నిద్రపోతోందని ఆయన విమర్శించారు. వందల ఎకరాల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు ఆయన ఆరోపించారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులను ఖాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మైనింగ్ కంపెనీ పరికరాలను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ మాఫియా గ్యాంగ్ పనిచేస్తోందని, ఎవరిని కూడా ఆ ఛాయలకు రానీయడం లేదని, డిఎఫ్ఓపై దాడి చేశారని ఆయన చెప్పారు. ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంపై చర్చకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications