హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం వలన తెలుగుదేశంపార్టీకే ప్రయోజనమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ గౌడ్ చెప్పారు. ప్రజారాజ్యం పట్ల ప్రజల్లో విశ్వసనీయత లేదని, ఈ పొత్తుతో ఆ విషయాన్ని మరింత తేటతెల్లంగా ప్రజలు తెలుసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం పార్టీ మొదటి నుంచీ కాంగ్రెస్ కు అనుకూలంగానే వ్యవహరిస్తోందని, ఆ సంగతిని తెలుగుదేశంపార్టీ ఎప్పుడో చెప్పిందని ఆయన అన్నారు. ఇప్పుడు అది వాస్తవమని రుజువైందని ఆయన చెప్పారు.
కాగా కాంగ్రెస్ తో ప్రజారాజ్యం పొత్తు ఆదివారం సాయంత్రమే ఖరారు కావల్సి ఉండగా, ప్రజారాజ్యం ఎక్కువ కార్పొరేటర్ స్ధానాలు డిమాండ్ చేస్తున్నందువల్ల చర్చలు వాయిదా పడే అవకాశముంది.