వైఎస్ బాటలోనే నేనూ: రోశయ్య

వరదల సమయంలో అధికారయంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ఆయన కితాబునిచ్చారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన కర్నూలు, మహబూబ్‌నగర్ నల్గొండ, కృష్ణా,గుంటూరు జిల్లాలను ఆదుకుంటామన్నారు. నిర్వాసితులకు సాయం అందించమని విజ్ఞప్తి చేస్తే దాతలు దాదాపు రూ. వందకోట్లకు పైగా విరాళాలివ్వడం వారి విశాలహృదయానికి దర్పణంగా నిలుస్తుందన్నారు. రైతుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. రైతు బాగుంటేనే గ్రామాలు పచ్చగా ఉంటాయని దేశమూ సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.












Click it and Unblock the Notifications