గవర్నర్ జమీర్ తో అశోక్ చవాన్ భేటీ

Sonia Gandhi
ముంబై: మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ మంగళవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ ఎస్సీ జమీర్ తో భేటీ అయ్యారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఆయన రాజ్ భవన్ కు వచ్చి కలిశారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన గవర్నర్ తో మాట్లాడారు. ఫలితాలు వెలువడి ఎంతో కాలం గడస్తున్నా కాంగ్రెసు, ఎన్సీపిల మధ్య మంత్రి పదవులపై, శాఖలపై చర్చలు కొలిక్కి రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది.

ప్రభుత్వ ఏర్పాటు ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజబల్ తో కూడా జమీర్ విడిగా సమావేశమైనట్లు రాజభవన్ వర్గాలు చెప్పాయి. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 22వ తేదీన వెలువడ్డాయి. ఇప్పటి వరకు కాంగ్రెసు, ఎన్సీపిల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. హోం, ఆర్థిక, ఇంధనం వంటి ప్రధాన శాఖల కోసం ఎన్సీపి పట్టుబడుతోంది. అయితే కొన్ని ప్రధాన శాఖలను ఎన్సీపికి ఇవ్వడానికి కాంగ్రెసు వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. తాము అడిగిన మంత్రి పదవులు, శాఖలు ఇవ్వకపోతే కాంగ్రెసుకు వెలుపలి నుంచి మద్దతిస్తామని భుజబల్ చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+