గుంటూరు: కాంగ్రెసు రాజకీయాల్లో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ పావు అని తెలుగుదేశం నాయకుడు కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యానించారు. మనుగడ కోసం ప్రజారాజ్యం పార్టీ, ఆధిపత్యం కోసం కాంగ్రెసు గ్రూపులు ప్రయత్నిస్తున్నాయని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పొమ్మన్నా ప్రజారాజ్యం పార్టీ పొత్తుల కోసం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమకు వామపక్షాలతో, ఎంబటితో పొత్తులుంటాయని ఆయన చెప్పారు.
తమకు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఇంకా ఒక కొలిక్కి రాలేదని సిపిఎం కార్యదర్శి బివి రాఘవులు చెప్పారు. పొత్తు కుదరకపోతే తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఆయన చెప్పారు.