సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధర్మశాల వద్ద ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 22 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కంగరా జిల్లా హరిపూర్ వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 248మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాజేంద్రప్రసాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలించారు.