హైదరాబాద్: తమ ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగారు. దీంతో వివిధ ఆస్పత్రుల్లో అత్యవసర సేవలకు విఘాతం కలిగింది. సమ్మెలో భాగంగా హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ర్యాలీ చేపట్టారు. వైద్య విద్యార్థులకు ఇస్తున్న పద్ధతిలో తమకు ఉపకార వేతనం పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత పదేళ్లుగా తాము ఈ డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.
తమ డిమాండ్ కు ప్రభుత్వం పట్టించుకోకపోతే దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. సమ్మె వల్ల అవుట్ పేషంట్ విభాగంలో సేవలు నిలిచిపోయాయి. అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి.