ఏ మంత్రినీ తొలగించను: యడ్యూరప్ప

రాష్ట్రంలోని వ్యవహారాలన్నింటినీ పరిశీలించేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలనే ఒప్పందం ఇరు వర్గాల మధ్య కుదిరింది. మహిళా మంత్రిని తొలగించి ఆమె స్థానంలో స్పీకర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తన మంత్రివర్గం నుంచి ఎవరినీ కూడా తొలగించేది లేదని యడ్యూరప్ప చెప్పారు. రేపటి నుంచి పూర్తి భిన్నమైన యడ్యూరప్పను చూస్తారని ఆయన అన్నారు. ఇప్పుడు తనకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
తాను, రెడ్డి సోదరులు త్వరలో భేటీ అయి, సమస్యను పరిష్కరించుకుంటామని ఆయన చెప్పారు. త్వరలో రాష్టానికి పార్టీ కేంద్ర నాయకత్వం వస్తుందని ఆయన చెప్పారు. త్వరలో తాను వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications