హైదరాబాద్ : ఓబుళాపురం గనుల అక్రమాల వ్యవహారంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేపడుతుందని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని ముఖ్యమంత్రి రోశయ్య స్పష్టం చేశారు. ఓఎంసీ అక్రమాలపై ఈ రోజు తన నివాసంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇచ్చిన వినతి గురించి సీఎం రోశయ్య ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు.