హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో గల నోవా కళాశాలలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో కలత చెందిన ప్రేమ కుమార్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ప్రేమ కుమార్ ఆత్మహత్యకు యాజమాన్యం వేధింపులే కారణమని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ యాజమాన్యం వేధిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో నోవా కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.